Skip to content
Opens in a new window

[1] భూమి మీద ఉన్న సమస్తమా దేవునికి ఆనందధ్వని చేయుము!

[2] మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి. స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.

[3] ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి. దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.

[4] సర్వలోకం నిన్ను ఆరాధించుగాక. నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

[5] దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.

[6] సముద్రాన్ని ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు. ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు. అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.

[7] దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు. ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

[8] ప్రజలారా మా దేవుని స్తుతించండి. స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.

[9] దేవుడు మాకు ఆ జీవాన్ని ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.

[10] దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.

[11] దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు. భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.

[12] మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు. అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు. కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.

[13] కనుక నేను నీ ఆలయాలనికి బలులు తీసుకొస్తాను. నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను. నేను నీకు చాలవాగ్దానాలు చేసాను. ఇప్పుడు, నేను వాగ్దానం చేసిన వాటిని నీకు ఇస్తున్నాను.

[15] నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను. నేను నీకు పొట్టేళ్లతో ధూపం ఇస్తున్నాను. నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

[16] దేవుని ఆరాధించే ప్రజలారా మీరంతా రండి. దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబతాను.

[17] నేను ఆయన్ని ప్రార్థించాను. నేను ఆయన్ని స్తుతించాను.

[18] నా హృదయం పవిత్రంగా ఉంది. కనుక నా యెహోవా నా మాట విన్నాడు.

[19] దేవుడు నా మొరను విన్నాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడు.

[20] దేవుని స్తుతించండి! నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు. దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

కీర్తనల గ్రంథము — Chapters