[1] కొండల తట్టు నేను చూసాను. కానీ నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
[2] భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి నాకు సహాయం వస్తుంది.
[3] దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
[4] ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
[5] యెహోవాయే నిన్ను కాపాడేవాడు. యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
[6] పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు. రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
[7] ప్రతి అపాయం నుండి యోహోవా నిన్ను కాపాడుతాడు. యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
[8] నీవు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు. ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
కీర్తనల గ్రంథము — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150