Skip to content
Opens in a new window

[1] దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.

[2] దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.

[3] ఇంకెంత కాలం నా మీద దాడి చేస్తూ ఉంటావు. నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను. పడిపోతున్న కంచెలా ఉన్నాను.

[4] ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి పథకాలు వేస్తున్నారు. వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబతారు, కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.

[5] దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను. దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.

[6] దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు. పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.

[7] నా మహిమా విజయం దేవుని నుండి వస్తుంది. ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం

[8] ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి. మీ సమస్యలు దేవునితో చెప్పండి. దేవుడే మన క్షేమ స్థానం.

[9] మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు. నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు. వారు గాలిబడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.

[10] బలవంతంగా విషయాలను చేజిక్కించు కొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు. దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలచవద్దు. నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం ధనాన్ని నమ్ముకొన వద్దు.

[11] నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబతున్నాడు, “బలము దేవుని నుండే వస్తుంది.”

[12] నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది. ఒకడు చేసిన వాటిని బట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.

కీర్తనల గ్రంథము — Chapters