Skip to content
Opens in a new window

[1] యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి తిరిగి వెసుకకు తీసకొనివచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!

[2] మేము నవ్వుకుంటున్నాము. మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలు పెట్టే వాళ్లము. “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”

[3] ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పు కొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్మాము!

[4] యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము. ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.

[5] విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా వుండవచ్చు, కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.

[6] అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు, కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.

కీర్తనల గ్రంథము — Chapters