[1] యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు? నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా? నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
[2] నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి? ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి? ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?
[3] నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
[4] అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు. నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.
[5] యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను. నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
[6] యెహోవా నాకు మేలు కార్యాలు చేశాడు. కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.
కీర్తనల గ్రంథము — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150