Skip to content
Opens in a new window

[1] యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము. యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.

[2] యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి. నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశ్చింతగా చూడుము.

[3] నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను. నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.

[4] పనికిమాలిన ఆ మనుష్యుల్లో నేను ఒకడ్ని కాను.

[5] ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం. ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.

[6] యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను. నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.

[7] యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను. నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.

[8] యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ. మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.

[9] యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము. ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.

[10] ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి. చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచంతీసుకొంటారు.

[11] కానీ నేను నిర్దోషిని. కనుక దేవా నన్ను కరుణించి, రక్షించుము.

[12] నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను. యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.

కీర్తనల గ్రంథము — Chapters