Skip to content
Opens in a new window

[1] యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది. నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.

[2] మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?

[3] దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.

[4] ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే. ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.

[5] ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు. వాటికి కళ్లున్నాయి కానీ అవి చూడలేవు.

[6] వాటికి చెవులున్నాయి కానీ అవి వినలేవు. వాటికి ముక్కులున్నాయి కానీ అవి వాసన చూడలేవు.

[7] వాటికి చేతులు ఉన్నాయి కానీ అవి తాకలేవు. వాటికి కాళ్లు ఉన్నాయి కానీ అవి నడవలేవు. వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.

[8] ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.

[9] ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము. యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.

[10] అహరోను వంశస్తులు యెహోవాను నమ్ముతారు. యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.

[11] యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు. యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.

[12] యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు. యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు. యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.

[13] యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.

[14] యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.

[15] యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.

[16] ఆకాశం యెహోవాకు చెందుతుంది. కానీ భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.

[17] చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు. కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.

[18] ఆయితే మనం యెహోవాను స్తుతిస్తాం. మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము! యెహోవాను స్తుతించండి!

కీర్తనల గ్రంథము — Chapters