Skip to content
Opens in a new window

[1] యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు. అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.

[2] చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.

[3] ఆయితే, యెహోవా, నీవు నాకు కేడెము. నీవే నా అతిశయం. యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా చేస్తావు.

[4] యెహోవాకు నేను ప్రార్థిస్తాను. ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!

[5] నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును. ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!

[6] వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును. కానీ ఆ శత్రువులకు నేను భయపడను.

[7] యెహోవా, లెమ్ము నా దేవా, వచ్చి నన్ను రక్షించుము! నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి, వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.

[8] యెహోవా తన ప్రజలను రక్షించగలడు. యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.

కీర్తనల గ్రంథము — Chapters