Skip to content
Opens in a new window

[1] పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడు. తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.

[2] అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు. తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించని వాడు ధన్యుడు.

[3] దేవా నేను నీతో మరల మరల మాట్లాడాను. కానీ నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు. నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.

[4] దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు. తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.

[5] అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను. నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు. మరియు నీవు నా పాపాలను క్షమించావు.

[6] దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి. కష్టాలు మహా ప్రవాహంలా వచ్చి నాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.

[7] దేవా నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం. నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము. నీవు నన్ను ఆవరించి, కాపాడుము. నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.

[8] యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి నేను నీకు నేర్చించి, నడిపిస్తాను. నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.

[9] కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము. ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి. నీవు కళ్లెంను వారు ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”

[10] చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి. కానీ యెహోవాను నమ్ముకొనే వారిని ప్రేమ ఆవరిస్తుంది.

[11] మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి. పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.

కీర్తనల గ్రంథము — Chapters