[1] సర్వ దేశములారా ఇది వినండి. భూమి మీద నివసించే సకల ప్రజలారా ఇది వినండి.
[2] ప్రతి మనిషీ, ధనికులు, దరిద్రులు కలసి వినాలి.
[3] నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెప్పుతాను. నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
[4] సామెతపైనా ఆసక్తినుంచుతాను. ఇప్పుడు నా సితారాను వాయిస్తూ ఇప్పుడు కథను వివరిస్తాను.
[5] అపాయాన్ని గూర్చినేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు. నా దుష్ట శత్రువులు నన్ను చుట్టు ముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
[6] ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
[7] ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు. నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
[8] ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కు నేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
[9] ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు, మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
[10] చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు. మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
[11] శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది. వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
[12] ధనికులు నిరంతరం జీవించలేరు. వారు జంతువుల్లా మరణిస్తారు.
[13] బుద్ధిహీనులకి, మరియు వారు చెప్పేది అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
[14] మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి. మరణం వారి కాపరి. వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.
[15] కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు. సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
[16] మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు. తన ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
[17] ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంటవాడేమీ తీసుకొనిపోడు. వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
[18] అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు. ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
[19] అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు. అతడు ఇక వెలుగును ఎన్నటకి చూడడు.
[20] మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు.అతడు నశించే మృగంలాంటి వాడు.