Skip to content
Opens in a new window

[1] దేవా, నన్ను కరుణించు నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము. కష్టం దాటిపోయేవరకు నేను నీ శరణు జొచ్చియున్నాను.

[2] మహోన్నతుడైన దేవునికి సహోయం కోసం నేను ప్రార్థించాను. దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.

[3] పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు. నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన ఓడిస్తాడు. దేవుడు తన నిజమైన ప్రేమను నాకు చూపిస్తాడు.

[4] నా జీవితం ప్రమాదంలో ఉంది. నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు. ఈటెలు, బాణాలు వంటిపదునైన పళ్లు, ఖడ్గంలా పదునైన నాలుకలుగల మనుష్యులను తినే సింహాల్లా వారున్నారు.

[5] దేవా నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు. నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.

[6] నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు. వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు. నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు. కాని వారే దానిలో పడ్డారు.

[7] దేవా, నిన్ను విశ్యసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది. నేను ఆయనకు స్తుతులు పాడుతాసు.

[8] నా ఆత్మ, మేలుకోనుము! స్వరమండలమా, సితారా, మేలుకోండి వేకువను మనం మేల్కొందాము

[9] నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను. ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.

[10] నీ నిజమైన ప్రేమ ఆకాశంలో కెల్లా అత్యున్నత మేఘాలంకంటె ఎత్తయింది.

[11] ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు. ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.

కీర్తనల గ్రంథము — Chapters