Skip to content
Opens in a new window

[1] ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు. యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.

[2] ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు. ఇశ్రాయేలు ఆయన రాజ్యం ఆయింది.

[3] ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది. యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.

[4] పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి. కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.

[5] ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు? యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?

[6] పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు? కొండలూ మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?

[7] యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.

[8] బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే. ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.

కీర్తనల గ్రంథము — Chapters