[1] మోషే దైవనివాసాన్ని నిలబెట్టడం ముగించిన రోజు అతడు దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించాడు. గుడారానికి చెందిన సామానంతా బలిపీఠాన్నీ దాని పాత్రలన్నిటినీ కూడా అభిషేకించి ప్రతిష్ఠించాడు.
[2] ఆ రోజున ఇస్రాయేల్ ప్రజల నాయకులు అర్పణలు తెచ్చారు. వారు తమ తమ పూర్వీకుల కుటుంబాలలో ప్రధానులు, గోత్ర ప్రముఖులు, నమోదైన వారిమీద అధిపతులు.
[3] వారు తమ తమ అర్పణలు యెహోవా సన్నిధానానికి తీసుకువచ్చారు. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండినీ, ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క ఎద్దును, మొత్తం ఆరు గూడు బండ్లనూ పన్నెండు ఎద్దులనూ దైవనివాసం ఎదుటికి తీసుకువచ్చారు.
[4] అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[5] “నీవు వారిదగ్గర ఈ వస్తువులు తీసుకో. అవి సన్నిధిగుడారానికి చెందే సేవకోసం ఉంటాయి. వాటిని లేవీగోత్రికులకు ఇవ్వాలి, వారిలో ఒక్కొక్కడి సేవ ప్రకారం ప్రతివాడికీ ఇవ్వాలి.”
[6] మోషే ఆ బండ్లనూ ఎడ్లనూ తీసుకొని లేవీగోత్రికులకు ఇచ్చాడు.
[7] అతడు రెండు బండ్లనూ నాలుగు ఎడ్లనూ వారి వారి సేవప్రకారం గెర్షోను వంశంవారికి ఇచ్చాడు.
[8] యాజి అయిన అహరోను కొడుకు ఈతామారు చేతి కింద సేవ చేసే మెరారి వంశంవారికి, వారి వారి సేవప్రకారం, అతడు నాలుగు బండ్లనూ ఎనిమిది ఎద్దులనూ ఇచ్చాడు.
[9] కహాతు వంశంవారికి మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే, పవిత్ర వస్తువులు తమ భుజాలమీద మోయడమే వారి సేవ.
[10] మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజునే ఆ నాయకులు బలిపీఠం ప్రతిష్ఠకోసం తమ తమ అర్పణలు దాని ఎదుటికి తెచ్చారు.
[11] అంతకుముందు యెహోవా మోషేతో, “బలిపీఠాన్ని ప్రతిష్ఠించడానికి నాయకులలో ఒక్కొక్కరు ఒక్కోరోజున తన తన అర్పణలు అర్పించాలి” అన్నాడు.
[12] మొదటి రోజున అర్పణ తెచ్చినవాడు అమ్మీనాదాబు కొడుకూ యూదా గోత్రికుడూ అయిన నయస్సోను.
[13] అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి,
[14] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది),
[15] హోమంగా కోడె దూడా పొట్టేలు ఏడాది మగ గొర్రెపిల్లా,
[16] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[17] శాంతి బలిగా రెండు ఎద్దులూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది అమ్మీనాదాబు కొడుకు నయస్సోను అర్పణ.
[18] రెండో రోజున అర్పణ తెచ్చినవాడు నూయారు కొడుకూ ఇశ్శాకారు గోత్రికులకు నాయకుడూ అయిన నెతనేల్.
[19] అతడు అర్పణగా తెచ్చినది వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భైతులాలు), నైవేద్యంగా ఆ గిన్నె ఆ పాత్ర నిండా నూనెతో కలిపిన గోధుమ పిండి,
[20] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది),
[21] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా,
[22] పాపాల కోసమైన బలిగా మేకపోతు,
[23] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రె పోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది సూయారు కొడుకు నెతనేల్ అర్పణ.
[24] మూడో రోజున తన అర్పణ తెచ్చినవాడు హేలోను కొడుకూ జెబూలూను గోత్రికులకు నాయకుడూ అయిన ఏలీయాబు.
[25] అతడు అర్పణగా తెచ్చినవి వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి,
[26] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది),
[27] హోమంగా కోడె దూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా,
[28] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[29] శాంతి బలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రె పిల్లలూ. ఇది హేలోను కొడుకు ఏలీయాబు అర్పణ.
[30] నాలుగో రోజున అర్పణ తెచ్చినవాడు షేదేయూర్ కొడుకూ రూబేను గోత్రికులకు నాయకుడూ అయిన ఏలీసూర్.
[31] అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి,
[32] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది),
[33] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా,
[34] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[35] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది షేదేయూర్ కొడుకు ఏలీసూర్ అర్పణ.
[36] అయిదో రోజున అర్పణ తెచ్చినవాడు సూరీషద్దాయి కొడుకూ షిమ్యోను గోత్రికులకు నాయకుడూ అయిన షెలుమీయేల్.
[37] అతడు అర్పణగా తెచ్చినవి వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి,
[38] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది),
[39] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా,
[40] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[41] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగగొర్రెపిల్లలూ. ఇది సూరీషద్దాయి కొడుకు షెలుమీయేల్ అర్పణ.
[42] ఆరో రోజున అర్పణ తెచ్చినవాడు దెయూవేల్ కొడుకూ గాదు గోత్రికులకు నాయకుడూ అయిన ఎలీయాసాఫ్.
[43] అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్రస్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూటముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి,
[44] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది),
[45] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగగొర్రెపిల్లా,
[46] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[47] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగగొర్రెపిల్లలూ. ఇది దెయూవేల్ కొడుకు ఎలీయాసాఫ్ అర్పణ.
[48] ఏడో రోజు అర్పణ తెచ్చినవాడు అమీహూదు కొడుకూ ఎఫ్రాయిం గోత్రికులకు నాయకుడూ అయిన ఎలీషామా.
[49] అతడు అర్పణగా తెచ్చినవి – వెండిగిన్నె (పవిత్రస్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి,
[50] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది),
[51] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా,
[52] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[53] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేక పోతులూ అయిదు ఏడాది మగగొర్రెపిల్లలూ. ఇది అమీహూదు కొడుకు ఎలీషామా అర్పణ.
[54] ఎనిమిదో రోజున అర్పణ తెచ్చినవాడు పెదాసూర్ కొడుకూ మనష్షే గోత్రికులకు నాయకుడూ అయిన గమాలియేల్.
[55] అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్రస్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూటముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి,
[56] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది),
[57] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగగొర్రెపిల్లా,
[58] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[59] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు పొట్టేళ్ళూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది పెదాసూర్ కొడుకు గమాలియేల్ అర్పణ.
[60] తొమ్మిదో రోజున అర్పణ తెచ్చినవాడు గిద్యోనీ కొడుకూ బెన్యామీను గోత్రికులకు నాయకుడూ అయిన అబీదాను.
[61] అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్రస్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది). వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి,
[62] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది),
[63] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా,
[64] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[65] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు పొట్టేళ్ళు అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది గిద్యోనీ కొడుకు అబీదాను అర్పణ.
[66] పదో రోజున అర్పణ తెచ్చినవాడు అమీషదాయి కొడుకూ దాను గోత్రికులకు నాయకుడూ అయిన అహీయెజెరు.
[67] అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్ర నిండా నూనెతో కలిపిన గోధుమ పిండి,
[68] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది),
[69] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా,
[70] పాపాల కోసమైన బలిగా మేకపోతు,
[71] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది అమీషదాయి కొడుకు అహీయెజెరు అర్పణ.
[72] పదకొండో రోజున అర్పణ తెచ్చినవాడు ఒక్రాను కొడుకూ ఆషేరు గోత్రికులకు నాయకుడూ అయిన పగీయేల్.
[73] అతడు అర్పణగా తెచ్చినవి – వెండిగిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి,
[74] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది),
[75] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా,
[76] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[77] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేక పోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది ఒక్రాను కొడుకు పగీయేల్ అర్పణ.
[78] పన్నెండో రోజున అర్పణ తెచ్చినవాడు ఏనాను కొడుకూ నఫ్తాలి గోత్రికులకు నాయకుడూ అయిన అహీరా.
[79] అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి,
[80] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది),
[81] హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా,
[82] పాపాలకోసమైన బలిగా మేకపోతు,
[83] శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు పొట్టేళ్ళూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇవి ఏనాను కొడుకు అహీర అర్పణ.
[84] బలిపీఠాన్ని అభిషేకించిన కాలంలో ఇస్రాయేల్ ప్రజల నాయకులు అర్పించిన బలిపీఠ ప్రతిష్ఠ అర్పణలు ఇవి – పన్నెండు వెండి గిన్నెలూ పన్నెండు వెండి పాత్రలూ పన్నెండు బంగారు పెనాలూ.
[85] ప్రతి వెండి గిన్నె నూట ముప్ఫయి తులాలది. ప్రతి పాత్ర డెబ్భై తులాలది. ఆ గిన్నెల, పాత్రల వెండి అంతా, పవిత్ర స్థానం తులం ప్రకారం, రెండు వేల నాలుగు వందల తులాలు.
[86] ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనాలు పన్నెండు. పవిత్ర స్థానం తులం ప్రకారం ఒక్కొక్కటి పది తులాలది. పెనాల బంగారమంతా నూట ఇరవై తులాలు.
[87] హోమబలి కోడెలన్నీ పన్నెండు, పొట్టేళ్ళు పన్నెండు, ఏడాది మగ గొర్రెపిల్లలు పన్నెండు, వాటికి సంబంధించిన నైవేద్యాలు పన్నెండు. పాపం కోసమైన బలి మేకపోతులు పన్నెండు.
[88] శాంతిబలి ఎడ్లు ఇరవై నాలుగు, గొర్రెపోతులు అరవై, మేకపోతులు అరవై, ఏడాది మగ గొర్రెపిల్లలు అరవై. బలిపీఠాన్ని అభిషేకించాక బలిపీఠ ప్రతిష్ఠ అర్పణ ఇదే.
[89] మోషే యెహోవాతో మాట్లాడడానికి సన్నిధిగుడారంలోకి వెళ్ళినప్పుడల్లా శాసనాల పెట్టెమీద ఉన్న ప్రాయశ్చిత్తస్థానం మీదనుంచి, ఆ రెండు కెరూబుల రూపాల మధ్యనుంచి, యెహోవా స్వరం అతనికి వినిపించేది. అప్పుడు యెహోవా అతడితో మాట్లాడేవాడు.