Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ ప్రజలు, వారి వారి సేనలప్రకారం మోషే అహరోనుల నాయకత్వం క్రింద ఈజిప్ట్‌నుంచి బయలుదేరి చేసిన ప్రయాణాలు ఇవి:

[2] వారు బయలుదేరిన స్థలాల ప్రకారం, యెహోవా ఆజ్ఞాపించినట్టు, మోషే వారి ప్రయాణాలను వ్రాశాడు. వారు బయలుదేరిన స్థలాలప్రకారం వారి ప్రయాణాలు ఇవి:

[3] మొదటి నెల పదిహేనో రోజున వారు రామసేసు నుంచి ప్రయాణమయ్యారు. అది పస్కాపండుగ మరుసటి రోజు. తమ మధ్య యెహోవా సంహరించిన జ్యేష్ఠులందరినీ ఈజిప్ట్‌వాళ్ళు సమాధి చేస్తూ ఉంటే ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరారు.

[4] యెహోవా ఈజిప్ట్ దేవుళ్ళకు తీర్పు తీర్చాడు.

[5] ఇస్రాయేల్ ప్రజలు రామసేసు విడిచి వెళ్ళి సుక్కోతులో దిగారు.

[6] సుక్కోతునుంచి వెళ్ళి ఏతాంలో దిగారు. ఏతాం ఎడారి అంచున ఉంది.

[7] ఏతాం విడిచి వెళ్ళి బేల్‌సెఫోను ఎదుట ఉన్న పీహహీరోత్ వైపుకు వెనక్కు తిరిగి మిగ్దోల్ ఎదుట దిగారు.

[8] పీహహీరోత్ విడిచి వెళ్ళి సముద్రంగుండా దాటుతూ ఎడారిలోకి చేరి ఏతాం ఎడారిలో మూడు రోజులు ప్రయాణం చేసి మారాలో దిగారు.

[9] మారా విడిచి వెళ్ళి ఏలీంకు వచ్చారు. ఏలీంలో నీళ్ళ ఊటలూ డెబ్భై ఈతచెట్లూ ఉన్నాయి. వారక్కడ దిగారు.

[10] ఏలీం విడిచి వెళ్ళి ఎర్రసముద్రం దగ్గర దిగారు.

[11] ఎర్ర సముద్రం విడిచివెళ్ళి సీన్ ఎడారిలో దిగారు.

[12] సీన్ ఎడారి విడిచివెళ్ళి దోపకాలో దిగారు.

[13] దోపకా విడిచి వెళ్ళి ఆలూష్‌లో దిగారు.

[14] ఆలూష్ విడిచి వెళ్ళి రెఫిదీంలో దిగారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్ళు లేకపోయాయి.

[15] రెఫిదీం విడిచి వెళ్ళి సీనాయి ఎడారిలో దిగారు.

[16] సీనాయి ఎడారి విడిచివెళ్ళి కిబ్రోత్‌హత్తావాలో దిగారు.

[17] కిబ్రోత్‌హత్తావా విడిచివెళ్ళి హజేరోతులో దిగారు.

[18] హజేరోతు విడిచివెళ్ళి రిత్మాలో దిగారు.

[19] రిత్మా విడిచివెళ్ళి రిమ్మోన్‌పారెసులో దిగారు.

[20] రిమ్మోన్‌పారెసు విడిచివెళ్ళి లిబ్నాలో దిగారు.

[21] లిబ్నా విడిచివెళ్ళి రీసాలో దిగారు.

[22] రీసా విడిచి వెళ్ళి కెహేలాతులో దిగారు.

[23] కెహేలాతు విడిచి వెళ్ళి షాపెరుకొండ దగ్గర దిగారు.

[24] షాపెరుకొండ విడిచి వెళ్ళి హరాదాలో దిగారు.

[25] హరాదా విడిచి వెళ్ళి మకెలోతులో దిగారు.

[26] మకెలోతు విడిచి వెళ్ళి తాహతులో దిగారు.

[27] తాహతు విడిచి వెళ్ళి తారహులో దిగారు.

[28] తారహు విడిచి వెళ్ళి మిత్కాలో దిగారు.

[29] మిత్కా విడిచి వెళ్ళి హష్మోనాలో దిగారు.

[30] హష్మోనా విడిచి వెళ్ళి మొసేరోతులో దిగారు.

[31] మొసేరోతు విడిచి వెళ్ళి బెనేయాకానులో దిగారు.

[32] బెనేయాకాను విడిచి వెళ్ళి హోర్‌హగ్గిదుగాదులో దిగారు.

[33] హోర్‌హగ్గిదుగాదు విడిచి వెళ్ళి యొత్బాతాలో దిగారు.

[34] యొత్బాతా విడిచి వెళ్ళి ఎబ్రోనాలో దిగారు.

[35] ఎబ్రోనా విడిచి వెళ్ళి ఎసోన్‌గెబెరులో దిగారు.

[36] ఎసోన్‌గెబెరు విడిచి వెళ్ళి సీన్ ఎడారిలో దిగారు. అది కాదేషు.

[37] కాదేషు విడిచి వెళ్ళి ఎదోందేశం సరిహద్దు దగ్గర ఉన్న హోర్ పర్వతం దగ్గర దిగారు.

[38] యెహోవా ఆజ్ఞప్రకారం యాజి అయిన అహరోను హోర్ పర్వతమెక్కి అక్కడ చనిపోయాడు. ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ విడిచి వచ్చిన నలభైయో సంవత్సరం అయిదో నెల మొదటి రోజున అది జరిగింది.

[39] హోర్ పర్వతం మీద అహరోను చనిపోయినప్పుడు అతడి వయసు నూట ఇరవై మూడేళ్ళు.

[40] కనానుదేశ దక్షిణ ప్రాంతంలో నివసించిన ఆరాదు పట్టణం రాజు ఇస్రాయేల్ ప్రజలు వస్తున్నారని విన్నాడు. అతడు కనానుజాతివాడు.

[41] తరువాత ఇస్రాయేల్ ప్రజలు హోర్ పర్వతం విడిచివెళ్ళి సల్మానాలో దిగారు.

[42] సల్మానా విడిచి వెళ్ళి పూనొనులో దిగారు.

[43] పూనొను విడిచి వెళ్ళి ఓబోతులో దిగారు.

[44] ఓబోతు విడిచి వెళ్ళి ఈయ్యెం అబారీంలో దిగారు. అది మోయాబు సరిహద్దులో ఉంది.

[45] ఈయ్యెం అబారీం విడిచివెళ్ళి దీబోన్‌గాదులో దిగారు.

[46] దీబోన్‌గాదు విడిచి వెళ్ళి అల్మోన్ దిబ్లతాయింలో దిగారు.

[47] అల్మోన్ దిబ్లాతాయిం విడిచి వెళ్ళి నెబో పర్వతం ఎదుటి అబారీం పర్వత పంక్తిలో దిగారు.

[48] అబారీం పర్వత పంక్తి విడిచి వెళ్ళి యెరికోకు ఎదురుగా యొర్దాను ఒడ్డున మోయాబు మైదానాల ప్రాంతంలో దిగారు.

[49] వారు మోయాబు మైదానాల ప్రాంతంలో బేత్‌యేషిమోతు మొదలుకొని ఆబేల్‌షిత్తీం వరకు యొర్దానుదగ్గర దిగారు.

[50] యెరికోకు ఎదురుగా యొర్దానుదగ్గర మోయాబు మైదానాల ప్రాంతంలో యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[51] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – మీరు యొర్దాను దాటి కనానులో చేరిన తరువాత

[52] ఆ దేశవాసులందరినీ మీ ఎదుట నుంచి వెళ్ళగొట్టాలి. వాళ్ళ చెక్కిన రాళ్ళనూ పోత విగ్రహాలనూ అన్నిటినీ నాశనం చేయాలి. వాళ్ళ ఎత్తయిన పూజాస్థలాలను పాడు చేయాలి.

[53] ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివసించాలి. ఆ దేశం మీ స్వాధీనంలో ఉండాలని దానిని నేను మీకిచ్చాను.

[54] మీరు మీ వంశాలప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువమందికి ఎక్కువ వారసత్వం, తక్కువమందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీట్ల ప్రకారం ఎవరి స్థలం వారికి దొరుకుతుంది. మీ పూర్వీకుల గోత్రాల ప్రకారం మీకు వారసత్వం రావాలి.

[55] ఒక వేళ మీరు మీ ఎదుటనుంచి ఆ దేశవాసులను వెళ్ళగొట్టకుండా ఉంటే, మీరు వాళ్ళలో ఉండనిచ్చేవాళ్ళు మీ కళ్ళలో ముళ్ళుగా మీ ప్రక్కలలో ములుకోలగా ఉంటారు. మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్ములను కష్ట పెడతారు.

[56] అంతేగాక నేను వాళ్ళకు ఏం చేయాలనుకొన్నానో అది మీకూ చేస్తాను.”

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters