[1] బెన్‌యామీనుకు మొదట పుట్టినవాడు బెల, రెండోవాడు అషబేల్, మూడోవాడు అహరహు,
[2] నాలుగోవాడు నోహా, అయిదోవాడు రాపా.
[3] బెలకు జన్మించిన కొడుకులు: అద్దారు, గెరా, అబీహూదు,
[4] అబీషూవ, నయమాను, అహోయహు,
[5] గెరా, షెపూపాను, హూరాం.
[6] ఏహూదుకు జన్మించిన కొడుకులు: నయమాను, అహీయా, గెరా. వీరు గెబ ఊరి వారికి కుటుంబాల నాయకులు. వారు బందీలుగా మనహతుకు వెళ్ళారు.
[7] గెరా వారిని అక్కడికి తీసుకు పోయాడు. ఈ గెరాకు ఉజ్జా, అహీహూదు జన్మించారు.
[8] షహరయిం తన భార్యలు హుషీంను, బయరాను పంపివేసిన తరువాత అతనికి మోయాబులో సంతానం కలిగారు.
[9] తన భార్య హోదెషు వల్ల యోబాబ్, జిబయా, మేషా, మల్కాం,
[10] యెవూజ్, షాకయా, మిర్మా జన్మించారు. వీరు అతని కొడుకులు. వారు కుటుంబాల నాయకులు.
[11] అతనికి హుషీం అబీటూబ్‌ను, ఎల్‌పయల్‌ను కన్నది.
[12] ఎల్‌పయల్ కొడుకులు: ఏబెరు, మిషాం, షెమెదు, బెరీయా, షెమదు.
[13] షెమెదు ఓనో, లోదులనూ లోదుకు చెందిన గ్రామాలనూ కట్టించాడు. బెరీయా, షెమ అయ్యాలోను నివాసులకు వంశ నాయకులు. వారు గాతు నివాసులను వెళ్ళగొట్టారు.
[14] బెరీయా కొడుకులు: అహయో, షాషకు, యరేమోతు,
[15] జెబదయా, అరాదు, ఏదెరు,
[16] మికాయేల్, ఇష్బా, యోహా.
[17] ఎల్‌పయల్ కొడుకులు: జబదయా, మెషుల్లాం, హిజికి, హెబెరు,
[18] ఇషమెరయి, ఇజలీయా, యోబాబ్.
[19] షిమీ కొడుకులు: యాకీం, జిక్రీ, జబ్ది,
[20] ఎలీయేనయి, జిల్లెతయి, ఎలీయేల్,
[21] అదాయా, బెరాయా, షిమ్రాతు.
[22] షాషకు కొడుకులు: ఇష్పాను, ఏబెరు, ఎలీయేల్,
[23] అబదోను, జిఖ్రీ, హనాను,
[24] హననయా, ఏలాం, అంతోతీయా,
[25] ఇపెదయా, పెనూయేల్.
[26] యెరోహాం కొడుకులు: షంషెరయి, షెహరయా, అతల్యా,
[27] యహరెషయా, ఏలీయా, జిఖ్రీ.
[28] వీరందరూ తమ పూర్వీకుల వంశవృక్షాల ప్రకారం వంశ నాయకులు; వారు జెరుసలంలో కాపురముంటూ ప్రముఖులయ్యారు.
[29] గిబియోను తండ్రి యెహీయేల్ గిబియోను పట్టణం లో కాపురముండేవాడు. అతని భార్య పేరు మయకా.
[30] అతనికి అబ్దోను మొదట జన్మించినవాడు. తరువాత సూర్, కీషు, బేల్, నాదాబ్,
[31] గెదోరు, అహయో, జెకెరు,
[32] మికలోతు జన్మించారు. మికలోతుకు షిమయా జన్మించాడు. వీరు తమ బంధువుల దగ్గర, జెరుసలంలో తమ బంధువులతో కూడా కాపురముండేవారు.
[33] నేర్‌కు కీషు జన్మించాడు. కీషుకు సౌలు జన్మించాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబ్, ఎష్‌బేల్ జన్మించారు.
[34] యోనాతాను కొడుకు మెరీబ్బేల్. మెరీబ్బేల్‌కు మీకా జన్మించాడు.
[35] మీకా కొడుకులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజ్.
[36] ఆహాజ్‌కు యెహోయాదా జన్మించాడు. యెహోయాదాకు ఆలెమెతు, ఆజమావెతు, జిమ్రీ జన్మించారు. జిమ్రీకి మోజా జన్మించాడు.
[37] మోజాకు బినయా జన్మించాడు. బినయాకు రాపా జన్మించాడు. రాపాకు ఎలాశా జన్మించాడు. ఎలాశాకు ఆజేల్ జన్మించాడు.
[38] ఆజేల్ కొడుకులు ఆరుగురు. వారి పేర్లు అజ్రీకాం, బోకెరు, ఇష్మాయేల్, షెయరయా, ఓబద్యా, హానాను. వీరందరూ ఆజేల్ కొడుకులు.
[39] అతని సోదరుడైన ఏషెకు కొడుకులు: మొదట పుట్టినవాడు ఊలాం, రెండోవాడు యెహూషు, మూడోవాడు ఎలీపేలెట్.
[40] ఊలా కొడుకులు విలువిద్యలో ప్రవీణులు, పరాక్రమశాలురు. వారికి నూట యాభై మంది కొడుకులూ మనుమలూ కలిగారు. వీరందరూ బెన్యామీను సంతతివారు.