[1] ద్వారపాలకుల గుంపుల విషయం: కోరహు వంశంలో ఆసాపు కొడుకులలో కోరె కొడుకు మెషెలెమయా.
[2] మెషెలెమయా కొడుకులు: మొదట పుట్టినవాడు జెకర్యా, రెండోవాడు యెదీయవేల్, మూడోవాడు జెబదయా, నాలుగోవాడు యతనీయేల్,
[3] అయిదోవాడు ఏలాం, ఆరోవాడు యెహోహనాను, ఏడోవాడు ఎల్‌యోయేనయి.
[4] దేవుడు ఓబేదెదోంను దీవించి అతనికి కొడుకులను ప్రసాదించాడు. వారెవరంటే, మొదట పుట్టినవాడు షెమయా, రెండోవాడు యెహోజాబాదు, మూడోవాడు యోవాహు, నాలుగోవాడు శాకారు, అయిదోవాడు నేతనేల్,
[5] ఆరోవాడు అమ్మీయేల్, ఏడోవాడు ఇశ్శాకారు, ఎనిమిదోవాడు పెముల్లెతయి.
[6] అతని కొడుకు షెమయాకు కూడా కొడుకులు ఉన్నారు. వారు పరాక్రమశాలురు గనుక వారు తమ తండ్రి వంశంలో నాయకులయ్యారు.
[7] షెమయా కొడుకులు ఒతని, రెఫాయేల్, ఓబేదు, ఎల్‌జాబాదు; సమర్థులైన అతని తోబుట్టువులు ఎలీహు, సెమకయా.
[8] వీరందరూ ఓబేదెదోం సంతతివారు. అతని కొడుకులు వారి కొడుకులూ బంధువులూ అరవై ఇద్దరు. వారు సేవకు బలం గల సమర్థులు.
[9] మెషెలెమయా కొడుకులు, బంధువులు పద్ధెనిమిదిమంది. వారు కూడా పరాక్రమశాలురు.
[10] మెరారి వంశంవాడు హోసాకు కొడుకులు ఉన్నారు. మొదటివాడు షిమ్రీ (అతడు మొదట పుట్టినవాడు కాకపోయినా అతడి తండ్రి అతణ్ణి జ్యేష్ఠుడుగా ఎంచాడు).
[11] రెండోవాడు హిల్కీయా, మూడోవాడు టెబలయా, నాలుగోవాడు జెకర్యా. హోసా కొడుకులూ బంధువులూ అందరూ పదముగ్గురు.
[12] ఈ ద్వారపాలకుల గుంపులకూ వారి నాయకులకూ తమ బంధువులలాగే యెహోవా ఆలయంలో సేవ చేసే బాధ్యతలు ఉన్నాయి.
[13] ఒక్కొక్క ద్వారం దగ్గర కాపలా దారులుగా ఉండడానికి తమ వంశాలప్రకారం చిన్నలకేమీ పెద్దలకేమి వారు చీట్లు వేశారు.
[14] తూర్పు దిక్కు కావలి షెలెమయాకు పడింది. తెలివైన సలహాదారుడూ అతడి కొడుకూ అయిన జెకర్యాకు కూడా చీటి వేశారు. ఉత్తర దిక్కు కావలి అతనికి పడింది.
[15] దక్షిణ దిక్కు కావలి ఓబేదెదోంకు పడింది. గిడ్డంగి కావలి అతడి కొడుకులకు పడింది.
[16] పడమటి దిక్కు కావలి, మీది మార్గం దగ్గర ఉన్న షెల్లెకెతు ద్వారం కావలి షుప్పీంకూ, హోసాకూ పడింది. వీరందరూ వరుసలుగా కావలి కాచేవారు.
[17] ప్రతి రోజూ తూర్పున ఆరుగురు లేవీగోత్రికులు ఉన్నారు; ఉత్తరాన నలుగురు ఉన్నారు; దక్షిణాన నలుగురు ఉన్నారు; గిడ్డంగి ఇరువైపులా ఇద్దరేసి ఉన్నారు;
[18] పడమటి ద్వారం దగ్గర ఉన్న మార్గం దగ్గర నలుగురు ఉన్నారు, ద్వారం దగ్గరే ఇద్దరు ఉన్నారు.
[19] కోరహు, మెరారి వంశాలవారైన ద్వారపాలకుల గుంపులు ఇవి.
[20] వారి సాటి లేవీగోత్రికులు దేవుని ఆలయం ఖజానాల విషయం, దేవుని అంకితమైన వస్తువుల ఖజానాల విషయం బాధ్యత వహించేవారు.
[21] గెర్షోను వంశంవాడు లద్దాను సంతతివారు దేవుని ఆలయం ఖజానాల విషయం బాధ్యత వహించేవారు.
[22] వారు యెహీయేలీ, యెహీయేలీ కొడుకులు జేతాం, అతడి తోబుట్టువు యోవేల్. వారు గెర్షోను వంశంవారు, తమ కుటుంబాల నాయకులు.
[23] అమ్రాం వంశస్థులలో ఇసహారు వంశస్థులలో, హెబ్రోను వంశస్థులలో ఉజ్జీయేల్ వంశస్థులలో ఉన్నవారి విషయం:
[24] మోషే కొడుకు గెర్షోను సంతతివాడైన షెబూయేలు ఖజానాల అధికారి.
[25] ఎలియెజెరు ద్వారా అతడి బంధువులెవరంటే, ఎలియాజరు కొడుకు రెహబయా, అతడి కొడుకు యెషయా, అతడి కొడుకు యెహోరాం, అతడి కొడుకు జిబ్రీ, అతడి కొడుకు షెలోమీతు.
[26] దేవునికి అంకితమైన వస్తువులున్న ఖజానాలన్నిటినీ కాపాడే బాధ్యత షెలోమీతుకూ అతడి బంధువులకూ ఉంది. ఆ వస్తువులను దావీదురాజు, వంశనాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు ఇతర సైన్యాధిపతులు అంకితం చేశారు.
[27] యెహోవా ఆలయాన్ని ఘనంగా కట్టించడానికి వారు యుద్ధంలో పట్టుకొన్న దోపిడీ సొమ్ములో కొంత అంకితం చేశారు.
[28] దీర్ఘదర్శి అయిన సమూయేలు, కీషు కొడుకు సౌలు, నేర్ కొడుకు అబ్నేర్, సెరూయా కొడుకు యోవాబు అంకితం చేసినవాటినన్నిటినీ కాపాడే బాధ్యత షెలోమీతుకూ అతడి బంధువులకూ ఉంది.
[29] ఇసహారు వంశంవారిలో కెననయా, అతడి కొడుకులు బయటి బాధ్యతలను నిర్వహించడానికి నియమించబడ్డారు. వారు ఇస్రాయేల్ ప్రజలకు లేఖకులుగా, న్యాయాధిపతులుగా ఉన్నారు.
[30] హెబ్రోను వంశంవారిలో హషబయా, అతడి బంధువులు యొర్దానునది పడమటి దిక్కున ఉన్న ఇస్రాయేల్ ప్రజల విషయమైన యెహోవా సేవ అంతటికీ రాజు పనులకూ బాధ్యత వహించేవారు. వారు వెయ్యిన్ని ఏడు వందలమంది సమర్థులు.
[31] హెబ్రోనువారికి, వారు పూర్వీకుల వంశావళి ప్రకారం, యెరీయా నాయకుడు. దావీదు పరిపాలించిన నలభైయో సంవత్సరంలో వారి విషయం వంశవృక్షాలలో పరిశోధన చేయడం జరిగింది. అప్పుడు గిలాదు ప్రదేశంలోని యాజేరులో పరాక్రమశాలురైన హెబ్రోను వంశంవారు ఉన్నారని తెలిసింది.
[32] కుటుంబ నాయకులుగా ఉండి, సామర్థ్యం గల యెరీయా బంధువులు రెండువేల ఏడు వందలమంది. దావీదురాజు దేవుని విషయాలన్నిటిలో, రాజ కార్యాల విషయంలో వారిని రూబేను గోత్రంవారిమీదా గాదు గోత్రంవారిమీదా మనష్షే అర్ధగోత్రంవారిమీదా నియమించాడు.