[1] ఆదాము, షేతు, ఎనోషు,
[2] కేయినాను, మహలలేల్, యెరెదు,
[3] హనోకు, మెతూషెల, లెమెకు,
[4] నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.
[5] యాపెతు కొడుకులు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాల్, మెషెకు, తీరసు.
[6] గోమెరు కొడుకులు: అష్‌కనజు, రీఫతు, తోగర్మా.
[7] యావాను కొడుకులు: ఎలీషా, తర్షీషు, కిత్తీం, దోదానీం.
[8] హాము కొడుకులు: కూషు, మిస్రాయిం, పూతు, కనాను.
[9] కూషు కొడుకులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు: షెబ, దదాను.
[10] కూషుకు నిమ్రోదు జన్మించాడు. నిమ్రోదు భూమిమీద పరాక్రమశాలి అయ్యాడు.
[11] మిస్రాయిం సంతతివారు: లూదీయవారు, అనామీయులు, లెహాబీయులు, నపతుహీయులు,
[12] పత్రుసీయులు, ఫిలిష్తీయవాళ్ళ వంశకర్తలైన కసలూహీయులు, కఫతోరివారు,
[13] కనానుకు మొదట పుట్టినవాడు సీదోను, తరువాత హేతు. కనాను సంతతివారు:
[14] యెబూసి, అమోరీ, గిర్‌గాషి,
[15] హివ్వి, అర్కి, సిని,
[16] అర్వాది, సెమారి, హమాతి జాతులవారు.
[17] షేము కొడుకులు: ఎలాం, అష్షూరు, అర్‌పక్షదు, లూదు, అరాం. అరాం కొడుకులు: ఊజు, హూల్, గెతెరు, మెషెకు,
[18] అర్‌పక్షదుకు షేలహు జన్మించాడు. షేలహుకు ఏబెరు జన్మించాడు.
[19] ఏబెరుకు ఇద్దరు కొడుకులు జన్మించారు. ఒకడి పేరు పెలెగు – ఎందుకంటే అతడి రోజుల్లో భూలోకం దేశాలుగా విభాగాలైంది. అతడి తోబుట్టువు యొక్తాను.
[20] యొక్తానుకు జన్మించినవారు అల్‌మోదాదు, షెలపు, హసర్‌మావెతు, యెరహు,
[21] హదోరం, ఊజాల్, దిక్లా,
[22] ఏబాల్, అబీమాయేల్, షేబ,
[23] ఓఫీరు, హవీలా, యోబాలు. వీరందరూ యొక్తాను కొడుకులు.
[24] అబ్రాహాము వంశావళి: షేము, అర్‌పక్షదు, షేలహు,
[25] ఏబెరు, పెలెగు, రయూ,
[26] సెరూగు, నాహోరు, తెరహు,
[27] అబ్రాము (అంటే, అబ్రాహాము).
[28] అబ్రాహాము కొడుకులు: ఇస్సాకు, ఇష్మాయేల్.
[29] వీరి సంతతివారెవరంటే, ఇష్మాయేల్‌కు మొదట పుట్టినవాడు నెబాయోతు, తరువాత కేదారు, అద్‌బేల్, మిబ్‌శాం,
[30] మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
[31] యెతూర, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేల్ కొడుకులు.
[32] అబ్రాహాము ఉంచుకొన్న స్త్రీ కెతూరాకు జన్మించిన కొడుకులు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కొడుకులు: షేబ, దదాను,
[33] మిద్యాను కొడుకులు: ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్ దాయా. వీరందరూ కెతూరా సంతతివారు.
[34] అబ్రాహాముకు ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు కొడుకులు: ఏశావు, ఇస్రాయేల్.
[35] ఏశావు కొడుకులు: ఏలీఫజు, రెయూవేల్, యెయూషు, యాలాం, కోరహు,
[36] ఏలీఫజు కొడుకులు: తేమాను, ఓమారు, సెపో, గాతాం, కనజ్, తిమ్నా, అమాలేక్.
[37] రెయూవేల్ కొడుకులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
[38] శేయీరు కొడుకులు: లోతాను, శోబాల్, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
[39] లోతాను కొడుకులు: హోరీ, హోమాం, తిమ్నా లోతానుకు సోదరి.
[40] శోబాల్ కొడుకులు: అల్వాను, మనహతు, ఏబాల్, షెపో, ఒనాం. సిబ్యోను కొడుకులు: అయా, అనా.
[41] అనా కొడుకు: దిషోను. దిషోను కొడుకులు: హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
[42] ఏసెరు కొడుకులు: బిల్‌హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు: ఊజ్, అరాను.
[43] ఏ రాజూ ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించకముందు కాలంలో ఎదోంలో ఈ రాజులు పరిపాలించారు: బెయోరు కొడుకు బెల. అతడి పట్టణం పేరు దిన్‌హాబా.
[44] బెల చనిపోయిన తరువాత బొస్రా పట్టణంవాడూ జెరహు కొడుకూ అయిన యోబాబు అతడి స్థానంలో రాజయ్యాడు.
[45] యోబాబు చనిపోయిన తరువాత తేమాను ప్రదేశంవాడు హుషాం అతడి స్థానంలో రాజయ్యాడు.
[46] హుషాం చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యాను వాళ్ళను ఓడించినవాడూ బెదెదు కొడుకూ అయిన హదదు అతడి స్థానంలో రాజయ్యాడు. అతడి పట్టణం పేరు అవీతు.
[47] హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శమ్లా అతడి స్థానంలో రాజయ్యాడు.
[48] శమ్లా చనిపోయిన తరువాత నది ఒడ్డున ఉన్న రెహబోతు ఊరివాడైన షావూల్ అతడి స్థానంలో రాజయ్యాడు.
[49] షావూల్ చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బేల్‌హానాను అతడి స్థానంలో రాజయ్యాడు.
[50] బేల్‌హానాను చనిపోయిన తరువాత హదదు అతడి స్థానంలో రాజయ్యాడు. అతడి పట్టణం పేరు పాయు. అతడి భార్య పేరు మెహేతబేల్. ఆమె మేజాహాబ్ మనుమరాలు, మత్రేదు కూతురు.
[51] హదదు చనిపోయిన తరువాత ఎదోంలో ఉన్న నాయకులెవరంటే, తిమ్నా, అల్వా, యతేతు,
[52] అహోలీబామా, ఏలా, పీనోను,
[53] కనజ్, తేమాను, మిబ్‌సారు,
[54] మగదీయేల్, ఈరాం. వీరు ఎదోం దేశానికి నాయకులు.