[1] దావీదుకు హెబ్రోను పట్టణంలో జన్మించిన కొడుకులు వీరు: మొదట పుట్టినవాడు అమ్మోను. అతని తల్లి యెజ్రేల్ పట్టణస్థురాలు అహీనోయం. రెండోవాడు దానియేలు. అతని తల్లి కర్మెల్ గ్రామస్థురాలు అబీగేల్.
[2] మూడోవాడు అబ్‌షాలోం. అతని తల్లి గెషూరు రాజైన తల్మయి కూతురు మయకా. నాలుగోవాడు అదోనీయా. అతని తల్లి హగ్గీతు.
[3] అయిదోవాడు షెఫటయా. అతని తల్లి అబీటల్. ఆరోవాడు ఇత్రెయాం. దావీదు భార్య ఎగ్లా అతణ్ణి కన్నది.
[4] ఈ ఆరుగురు హెబ్రోనులో దావీదుకు జన్మించారు. అక్కడ అతడు ఏడు సంవత్సరాలు ఆరు నెలలు పరిపాలించాడు. జెరుసలంలో ముప్ఫయి మూడు సంత్సరాలు పరిపాలించాడు.
[5] జెరుసలంలో అతనికి జన్మించినవారు: అమ్మీయేల్ కూతురైన బత్‌షెబ కన్న షిమయా, షోబాబ్, నాతాను, సొలొమోను అనే నలుగురు;
[6] ఇభారు, ఎలీషూవ, ఎలీపేలెట్,
[7] నోగహు, నెపెగు, యాఫీయ,
[8] ఎలీషామా, ఎల్‌యాదా, ఎలీపేలెట్ అనే తొమ్మిదిమంది కొడుకులు.
[9] ఉంపుడు కత్తెలు కన్న అతని కొడుకులు గాక వీరందరూ దావీదు కొడుకులు. తామారు వీరికి సోదరి.
[10] సొలొమోను కొడుకు రెహబాం కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు.
[11] యెహోషాపాతు కొడుకు యెహోరాం. యెహోరాం కొడుకు అహజయా. అహజయా కొడుకు యోవాషు.
[12] యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజరయా. అజరయా కొడుకు యోతాం.
[13] యోతాం కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే.
[14] మనష్షే కొడుకు ఆమోను, ఆమోను కొడుకు యోషీయా.
[15] యోషీయా కొడుకులు: మొదట పుట్టినవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీం, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూం.
[16] యెహోయాకీం కొడుకులు యెకొనయా, సిద్కియా.
[17] ఖైదీగా ఉన్న యెకొనయా కొడుకులు: అస్సీరు, షయల్‌తీయేల్,
[18] మల్కీరాం, పెదాయా, షెనజ్జరు, యెకమయా, హోషామా, నెబదయా.
[19] పెదాయా కొడుకులు జెరుబ్బాబెల్, షిమీ. జెరుబ్బాబెల్ కొడుకులు: మెషుల్లాం, హననయా. షెలోమీతు వారికి సోదరి.
[20] హషుబా, ఓహెల్, బెరెకయా, హసదయా, యూషబ్‌హెసెదు అనే ఇంకా అయిదుగురు ఉన్నారు.
[21] హననయా సంతతివారు: పెలటయా, యెసయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకనయా కొడుకులు.
[22] షెకనయా సంతతివారు: షెమయా, షెమయా ఆరుగురు కొడుకులు – హట్టూషు, ఇగాల్, బారియా, నెయరయా, షాపాతు.
[23] నెయరయా కొడుకులు ముగ్గురు – ఎల్‌యోయేనయి, హిజ్కియా, అజ్రీకాం.
[24] ఎల్‌యోయేనయి కొడుకులు ఏడుగురు – హోదవయా, ఎల్‌యాషీబ్, పెలయా, అక్కూబ్, యోహానాను, దెలాయ్యా, అనాని.