[1] బబులోను చక్రవర్తి నెబుకద్‌నెజరు బందీలుగా తీసుకుపోయినవారి సంతానం అనేకులు బబులోను దేశంలో చెరనుంచి జెరుసలంకు, యూదా దేశానికి, ఎవరి ఊరికి వారు తిరిగి వచ్చారు.
[2] వారిలో జెరుబ్బాబెల్, యేషూవ, నెహెమ్యా, శెరయా, రేలాయా, మొర్‌దెకయి, బిల్‌షాను, మిస్‌పారు, బిగ్‌వయి, రెహూం, బయనా ఉన్నారు. బబులోనునుంచి వచ్చిన ఇస్రాయేల్ ప్రజల లెక్క ఇది:
[3] పరోషు వంశంవారు రెండు వేల నూట డెబ్భైఇద్దరు;
[4] షెఫట్యా వంశంవారు ఏడు వందల డెబ్భైఇద్దరు;
[5] ఆరహు వంశం వారు ఏడు వందల డెబ్భై అయిదుగురు.
[6] యేషూవ, యోవాబుల వంశాలలో పహత్‌మోయాబు కుటుంబంవారు రెండు వేల ఎనిమిది వందల పన్నెండుమంది;
[7] ఏలాం వంశంవారు వెయ్యి రెండు వందల యాభై నలుగురు;
[8] జత్తూ వంశంవారు తొమ్మిది వందల నలభై ఐదుగురు;
[9] జక్కయి వంశంవారు ఏడు వందల అరవైమంది;
[10] బానీ వంశంవారు ఆరు వందల నలభై ఇద్దరు;
[11] బేబయి వంశంవారు ఆరు వందల ఇరవై ముగ్గురు;
[12] అజెగదు వంశంవారు వెయ్యి రెండు వందల ఇరవై ఇద్దరు;
[13] అదొనీకాం వంశంవారు ఆరు వందల అరవై ఆరుమంది;
[14] బిగ్‌వయి వంశంవారు రెండు వేల యాభై ఆరుమంది;
[15] అదీను వంశం వారు నాలుగు వందల యాభై నలుగురు;
[16] హిజ్కియా వంశంలో అటేరు కుటుంబంవారు తొంభై ఎనిమిది మంది;
[17] బెజయి వంశంవారు మూడు వందల ఇరవై ముగ్గురు;
[18] యోరా వంశంవారు నూట పన్నెండు మంది;
[19] హాషుం వంశంవారు రెండు వందల ఇరవై ముగ్గురు.
[20] గిబ్బారు వంశంవారు తొంభై అయిదుమంది.
[21] బేత్‌లెహేంకు చెందిన వంశాలవారు నూట ఇరవై ముగ్గురు;
[22] నెటోపా గ్రామం వారు యాభై ఆరుమంది;
[23] అనాతోతు గ్రామం వారు నూట ఇరవై ఎనిమిది మంది;
[24] అజ్‌మావెతు గ్రామం వారు నలభై ఇద్దరు;
[25] కిర్యత్‌యారీం, కెఫీరా, బేరోతు గ్రామాలవారు ఏడువందల నలభై ముగ్గురు;
[26] రమా, గెబ గ్రామాల వారు ఆరు వందల ఇరవై ఒక్కరు;
[27] మిక్‌మషు గ్రామం వారు నూట ఇరవై ఇద్దరు;
[28] బేతేల్, హాయీ గ్రామాల వారు రెండు వందల ఇరవై ముగ్గురు;
[29] నెబో గ్రామం వారు యాభై ఇద్దరు;
[30] మగ్‌బీషు గ్రామం వారు నూట యాభై ఆరు మంది;
[31] ఇంకొక ఏలాం గ్రామం వారు వెయ్యి రెండు వందల యాభై నలుగురు;
[32] హారీం గ్రామం వారు మూడు వందల ఇరవై మంది;
[33] లోద్, హదీద్, ఓనో గ్రామాల వారు ఏడు వందల ఇరవై అయిదుమంది;
[34] యెరికో పట్టణం వారు మూడు వందల నలభై అయిదు మంది;
[35] సెనాయా ఊరి వారు మూడు వేల ఆరు వందల ముప్ఫయిమంది.
[36] యాజుల లెక్క: యెదాయా వంశంలో యేషూవ కుటుంబంవారు తొమ్మిది వందల డెబ్భై ముగ్గురు;
[37] ఇమ్మేరు వంశంవారు వెయ్యి యాభై ఇద్దరు;
[38] పషూరు వంశంవారు వెయ్యి రెండు వందల నలభై ఏడు మంది.
[39] హరీం వంశం వారు వెయ్యి పదిహేడు మంది.
[40] లేవీగోత్రికులు లెక్క: హోదవ్యా వంశంలో యేషూవ, కద్‌మీయేల్ అనే వారి కుటుంబాలవారు డెబ్భై నలుగురు.
[41] గాయకుల లెక్క: ఆసాపు వంశంవారు నూట ఇరవై ఎనిమిదిమంది.
[42] ద్వారపాలకులెవరంటే, షల్లూం, అటేరు, టల్‌మోను, అక్కూబ్, హటీటా, షోబయి అనే వారి వంశీయులు నూట ముప్ఫయి తొమ్మిదిమంది.
[43] దేవాలయ సేవకులు వీరు: జీహా, హశూపా, టబ్బాయోతు,
[44] కేరోసు, సీయహా, పాదోను,
[45] లెబానా, హగాబా, అక్కూబ్,
[46] హాగాబు, షల్మయి, హానాను,
[47] గిద్దేల్, గహరు, రెవాయా,
[48] రెజీను, నెకోదా, గజ్జాం,
[49] ఉజ్జా, పాసెయ, బేసాయి,
[50] అస్నా, మెహునీం, నెపూసీం,
[51] బక్‌బూకు, హకూపా, హర్‌జూరు,
[52] బజ్‌లీతు, మెహీదా, షర్షా,
[53] బర్కోసు, సీసెరా, తెమహు,
[54] నెజీయహు, హటీపా అనేవారి వంశాలవారు.
[55] సొలొమోను సేవకుల వంశాలవారు వీరు: సొటయి, హసోపెరెతు, పెరూదా,
[56] యహలా, దర్కోను, గిద్దేల్,
[57] షెపట్యా, హట్టీల్, పొకెరెత్ హజెబాయిం, ఆమీ అనేవారి వంశీయులు.
[58] దేవాలయ సేవకులూ సొలొమోను సేవకుల వంశాలవారూ అందరూ కలిసి మూడు వందల తొంభై ఇద్దరు.
[59] తేల్‌మెలహు, తేల్‌హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అనే స్థలాలకు చెందినవారు కొంతమంది వచ్చారు. కాని, వారు తమ పూర్వీకుల కుటుంబాలు, వంశాలు ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నాయో లేవో నిదర్శనాలు ఇవ్వలేకపోయారు.
[60] వారెవరంటే, దెలయ్యా, టోబీయా, నెకోదా అనేవారి వంశాలవారు. వారు ఆరువందల యాభై ఇద్దరు.
[61] అలాంటివారు యాజులలో కూడా కొంతమంది ఉన్నారు. వారు హబాయా, హాక్కోజు, బర్‌జిల్లయి అనేవారి వంశీయులు (ఈ బర్‌జిల్లయి గిలాదువాడైన బర్‌జిల్లయి కూతుళ్ళలో ఒకతెను పెండ్లి చేసుకొన్నాడు. కనుక ఆ పేరు అతడికి వచ్చింది).
[62] వారు వంశావళి గ్రంథంలో తమ పేరులను వెదికారు గాని అవి కనబడలేదు. అందుచేత వారు అపవిత్రులుగా ఎంచబడి యాజులలో చేరలేకపోయారు.
[63] “ఊరీం”, “తుమ్మీం” ధరించగల యాజి నియమించబడేవరకు దేవునికి ప్రతిష్ఠమైన భోజన పదార్థాలను వారు తినకూడదని ప్రజల అధికారి ఆదేశించాడు.
[64] సమకూడిన ఆ ప్రజల లెక్క మొత్తం నలభై రెండు వేల మూడు వందల అరవైమంది.
[65] వారు గాక వారి పరిచారకులు, పరిచారికలు ఏడు వేల మూడు వందల ముప్ఫయి ఏడుమంది. రెండు వందల మంది గాయకులు, గాయకురాండ్రు కూడా ఉన్నారు.
[66] ప్రజల గుర్రాలు ఏడు వందల ముప్ఫయి ఆరు, కంచరగాడిదలు రెండు వందల నలభై అయిదు,
[67] ఒంటెలు నాలుగు వందల ముప్ఫయి అయిదు, గాడిదలు ఆరువేల ఏడువందల ఇరవై.
[68] వారు జెరుసలంలో యెహోవా దేవాలయం ఉన్న స్థలానికి చేరినప్పుడు, వంశనాయకులలో కొంతమంది ఆ దేవాలయాన్ని దాని స్థలంలో మళ్ళీ కట్టడానికి స్వేచ్ఛార్పణలు ఇచ్చారు.
[69] ఆ పనికోసం తమ శక్తి కొద్ది వారు ఖజానాకు ఇచ్చినది అయిదు వందల కిలోగ్రాముల బంగారం, మూడు వేల కిలోగ్రాముల వెండి, యాజుల కోసం నూరు వస్త్రాలు.
[70] తరువాత యాజులు, లేవీగోత్రికులు ప్రజలలో కొంతమందితోకూడా, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు తమ ఊళ్ళకు వెళ్ళి కాపురం చేశారు. మిగిలిన ఇస్రాయేల్ ప్రజలంతా కూడా తమ ఊళ్ళలో కాపురం చేశారు.