Skip to content
Opens in a new window

[1] దాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, యెరెదు హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు.

[4] షేము, హాము, యాపెతు.

[5] యాపెతు కుమారులెవరనగా: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు మరియు తీరసు.

[6] అష్కనజు, రీఫతు, తోగర్మాలనేవారు గోమెరు కుమారులు.

[7] ఎలీషా, తర్షీషు, కిత్తీము, రోదానీము అనేవారు యావాను కుమారులు.

[8] కూషు, (ఇథియోపియ) మిస్రాయిము, (ఈజిప్టు) పూతు మరియు కనాను అనేవారు హాము కుమారులు.

[9] సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా అనేవారు కూషు కుమారులు. షెబ, దదాను అనేవారు రాయమా కుమారులు.

[10] నిమ్రోదు అనువాడు కూషు సంతతివాడు. నిమ్రోదు ప్రపంచంలోనే మహా ధైర్యవంతుడు, బలవంతుడైన సైనికుడయ్యాడు.

[11] లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు వీరందరికి మిస్రాయిము (ఈజిప్టు) వంశకర్త.

[12] అంతేకాదు, పత్రుసీయులకు, కస్లూహీయులకు మరియు కఫ్తోరీయులకు కూడ మిస్రాయిము వంశకర్త. ఫిలిష్తీయులు (పాలస్తీను ప్రజలు) కస్లూహునుండి వచ్చినవారు.

[13] కనాను పెద్ద కుమారుని పేరు సీదోను, రెండవ కుమారుడు హేతు. మరియు హిత్తీయులకు

[14] యెబూసీయులకు, అమోరీయులకు, గిర్గాషీయులకు,

[15] హివ్వీయులకు, అర్కీయులకు, సీనీయులకు,

[16] అర్వాదీయులకు, సెమారీయులకు మరియు హమాతీయులకు కూడ కనాను వంశకర్త.

[17] షేము కుమారులు ఎవరనగా: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు మరియు అరాము. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు మరియు మెషెకు.

[18] అర్పక్షదుకు షేలహు అను కుమారుడు పుట్టాడు. షేలహునకు ఏబెరు అనువాడు పుట్టాడు.

[19] ఏబెరుకు ఇద్దరు కుమారులు. ఒకని పేరు పెలెగు. అతని కాలంలో ప్రపంచ జనాభా వివిధ భాషా వర్గాలుగా విడిపోయిన కారణంగా అతనికి పెలెగు అని పేరు పెట్టారు. పెలెగు సోదరుని పేరు యొక్తాను. (

[20] అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,

[21] హదోరము, ఊజాలు, దిక్లాను,

[22] ఏబాలు, అబీమాయేలు, షేబ,

[23] ఓఫీరు, హవీలా మరియు యోబాబు. వీరంతా యొక్తాను కుమారులు.)

[24] అబ్రాహాము సంతానం ఎవరనగా: షేము, అర్పక్షదు, షేలహు,

[25] ఏబెరు, పెలెగు, రయూ,

[26] సెరూగు, నాహోరు, తెరహు,

[27] మరియు అబ్రాహాము పేరుతో పిలవబడిన అబ్రాము.

[28] అబ్రాహామునకు ఇస్సాకు, ఇష్మాయేలు అను ఇరువురు కుమారులు.

[29] ఇష్మాయేలు సంతానం ఎవరనగా: ఇష్మాయేలు ప్రథమ పుత్రుడు నెబాయోతు. ఇష్మాయేలు ఇతర కుమారులెవరనగా కేదారు, అద్బయేలు, మిబ్శాము,

[30] మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,

[31] యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా ఇష్మాయేలు కుమారులు.

[32] కెతూరా అబ్రాహాముకు దాసి. ఆమెకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు మరియు షూవహు అను కుమారులు కలిగారు. యొక్షానుకు షేబ, దదాను అను కుమారులు పుట్టారు.

[33] ఏయిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతతివారు.

[34] ఇస్సాకు తండ్రి పేరు అబ్రాహాము. ఇస్సాకు కుమారుల పేర్లు ఏశావు, ఇశ్రాయేలు.

[35] ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యలాము మరియు కోరహు అనేవారు ఏశావు కుమారులు.

[36] తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా మరియు అమాలేకు అనేవారు ఎలీఫజు కుమారులు.

[37] నహతు, జెరహు, షమ్మా మరియు మిజ్జ అనువారు రెయూవేలు కుమారులు.

[38] లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు మరియు దిషోను అనువారంతా శేయీరు కుమారులు.

[39] హోరీ, హోమాను ఇరువురూ లోతాను కుమారులు. తిమ్నా అనే యువతి లోతాను సోదరి.

[40] అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము అనువారు శోబాలు కుమారులు. అయ్యా, అనా అను వారిరువురూ సిబ్యోను కుమారులు.

[41] అనా కుమారుని పేరు దిషోను. అమ్రాము, ఎష్బాను, ఇత్రాను, కెరాను అనువారు దిషోను కుమారులు.

[42] బిల్హాను, జవాను, యహకాను అనువారు ఏసెరు కుమారులు. ఊజు, అరానులిరువురూ దిషాను కుమారులు.

[43] ఎదోము రాజుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: ఇశ్రాయేలులో రాజరిక వ్యవస్థ ఏర్పడటానికి చాలాకాలం క్రిందటనే ఏదోములో రాజులు పాలించారు. వీరు ఎవరనగా బెయారు కుమారుడైన బెల, అతని నగరం పేరు దిన్హాబా.

[44] బెల చనిపోయిన పిమ్మట అతని స్థానంలో యోబాబు రాజయ్యాడు. యోబాబు తండ్రి పేరు జెరహు. యోబాబు బొస్రా నగరానికి చెందినవాడు.

[45] యోబాబు చనిపోయిన తరువాత హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము తేమానీయుల దేశపువాడు.

[46] హుషాము చనిపోయిన పిమ్మట హదదు రాజయ్యాడు. హదదు తండ్రి పేరు బెదెదు. మోయాబు దేశంలో మిద్యానీయులను హదదు ఓడించాడు. హదదు అవీతు నగరంవాడు.

[47] హదదు చనిపోగా శమ్లా రాజయ్యాడు. ఇతడు మశ్రేకా నగరవాసి.

[48] శమ్లా చనిపోయిన పిమ్మట షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు యూఫ్రటీసు నదీ తీరానగల రహెబోతు పట్టణపు వాడు.

[49] షావూలు మరణానంతరం బయల్ — హానాను రాజయ్యాడు. బయల్ — హానాను తండ్రి పేరు అక్బోరు.

[50] బయల్ — హానాను చనిపోగా హదదు అతని స్థానంలో రాజయ్యాడు. హదదు నగరం పేరు పాయు. హదదు భార్య పేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. మత్రేదు మేజాహాబు కుమార్తె.

[51] కొంత కాలానికి హదదు చనిపోయాడు. అప్పట్లో ఎదోము రాజ్యంలో తిమ్నా, అల్వాయతేతు,

[52] అహలీబామా, ఏలా, పీనోను,

[53] కనజు, తేమాను, మిబ్సారు,

[54] మగ్దీయేలు మరియు ఈరాము నాయకులుగా ఉన్నారు. వీరంతా ఎదోము దేశ నాయకులు.

1 దినవృత్తాంతములు — Chapters