Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:10

[1] లేవీయుల వంశపు పెద్దలు యాజకుడు ఎలియాజరు దగ్గరికీ నూను కుమారుడు యెహోషువ దగ్గరికీ ఇశ్రాయేలీయుల గోత్రాల, కుటుంబాల పెద్దల దగ్గరికీ వచ్చారు.

[2] అప్పుడు వారు కనాను దేశంలోని షిలోహులో వారిని కలిసి “మేము నివసించడానికి పట్టణాలనూ మా పశువులకు పచ్చిక మైదానాలనూ ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు” అన్నారు.

[3] ఇశ్రాయేలీయులు యెహోవా మాట ప్రకారం తమ స్వాస్థ్యంలో ఈ పట్టణాలను, వాటి పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు.

[4] కహాతీయుల వంశాల చీటి వచ్చింది. లేవీయుల్లో యాజకుడైన అహరోను వంశం వారికి యూదా, షిమ్యోను, బెన్యామీను, గోత్రాల స్వాస్థ్యాల నుండి చీట్ల వలన పదమూడు పట్టణాలు వచ్చాయి.

[5] మిగిలిన కహాతీయులకు ఎఫ్రాయిము, దాను, మనష్షే అర్థ గోత్ర కుటుంబాల నుండి చీట్ల వలన పది పట్టణాలు వచ్చాయి.

[6] గెర్షోనీయులకు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులో ఉన్న మనష్షే అర్థ గోత్ర కుటుంబాల నుండి చీట్ల వలన పదమూడు పట్టణాలు వచ్చాయి.

[7] మెరారీయులకు రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు వచ్చాయి.

[8] యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చీట్లు వేసి ఆ పట్టణాలను, పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు.

[9] యూదా, షిమ్యోను గోత్రాల్లో ఈ కింద చెప్పిన పట్టణాలను వారికిచ్చారు.

[10] వాటిని లేవీయులైన అహరోను వంశంలోని కహాతీయుల కుటుంబాలకు ఇచ్చారు, ఎందుకంటే మొదట పడిన చీటి ప్రకారం వంతు వారిది.

[11] యూదా కొండసీమలో వారికి కిర్యతర్బా, అంటే హెబ్రోను (అర్బా అనాకు తండ్రి) దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు ఇచ్చారు.

[12] అయితే ఆ పట్టణ పొలాలూ దాని పల్లెలు యెఫున్నె కుమారుడు కాలేబుకు ఆస్తిగా ఇచ్చారు.

[13] హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న హెబ్రోను, దాని పచ్చిక మైదానాలు యాజకుడైన అహరోను సంతానపు వారికి ఇచ్చారు.

[14] లిబ్నా, దాని పచ్చిక మైదానాలనూ యత్తీరు, దాని పచ్చిక మైదానాలనూ ఎష్టేమోయ, దాని పచ్చిక మైదానాలనూ హోలోను, దాని పచ్చిక మైదానాలనూ

[15] దెబీరు, దాని పచ్చిక మైదానాలనూ ఆయిని, దాని పచ్చిక మైదానాలనూ యుట్టయు, దాని పచ్చిక మైదానాలనూ బేత్షెమెషు, దాని పచ్చిక మైదానాలనూ

[16] అంటే ఆ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలనూ ఇచ్చారు.

[17] బెన్యామీను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే గిబియోను, దాని పచ్చిక మైదానాలనూ గెబను, దాని పచ్చిక మైదానాలనూ

[18] అనాతోతు, దాని పచ్చిక మైదానాలనూ అల్మోను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.

[19] యాజకులైన అహరోను వంశం వారి పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు పోతే పదమూడు పట్టణాలు.

[20] కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అంటే కహాతు వంశాల్లో మిగిలినవారికి చీట్ల ద్వారా ఎఫ్రాయిం గోత్రం నుండి పట్టణాలు వచ్చాయి.

[21] నాలుగు పట్టణాలను, అంటే ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతంలో అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న షెకెం, దాని పచ్చిక మైదానాలనూ గెజెరు, దాని పచ్చిక మైదానాలనూ

[22] కిబ్సాయిం, దాని పచ్చిక మైదానాలనూ బేత్‌ హోరోను, దాని పచ్చిక మైదానాలనూ వారికిచ్చారు.

[23] దాను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే ఎత్తెకేను, దాని పచ్చిక మైదానాలనూ గిబ్బెతోను, దాని పచ్చిక మైదానాలనూ

[24] అయ్యాలోను, దాని పచ్చిక మైదానాలనూ గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలనూ వారికిచ్చారు.

[25] రెండు పట్టణాలు, అంటే మనష్షే అర్థగోత్ర కుటుంబాల నుండి తానాకు, దాని పచ్చిక మైదానాలనూ గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.

[26] వాటి పచ్చిక మైదానాలు గాక కహాతు సంబంధుల్లో మిగిలినవారికి వచ్చిన పట్టణాలన్నీ పది.

[27] లేవీయుల వంశాల్లో గెర్షోనీయులకు రెండు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న బాషానులోని గోలాను, దాని పచ్చిక మైదానాలనూ బెయెష్టెరా, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.

[28] ఇశ్శాఖారు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే కిష్యోను, దాని పచ్చిక మైదానాలనూ దాబెరతు, దాని పచ్చిక మైదానాలనూ యర్మూతు, దాని పచ్చిక మైదానాలనూ

[29] ఏన్గన్నీము, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.

[30] ఆషేరు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే మిషెయలు, దాని పచ్చిక మైదానాలనూ అబ్దోను, దాని పచ్చిక మైదానాలనూ

[31] హెల్కతు, దాని పచ్చిక మైదానాలనూ రెహోబు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.

[32] నఫ్తాలి గోత్రం నుండి మూడు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గలిలయలోని కెదెషు, దాని పచ్చిక మైదానాలనూ హమ్మోత్దోరు, దాని పచ్చిక మైదానాలనూ కర్తాను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.

[33] వారి వంశాల ప్రకారం గెర్షోనీయుల పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు కలుపుకుని పదమూడు పట్టణాలు.

[34] లేవీయుల్లో మిగిలిన మెరారీయుల వంశాలకు జెబూలూను గోత్రాల నుండి నాలుగు పట్టణాలను, అంటే యొక్నెయాము, దాని పచ్చిక మైదానాలనూ

[35] కర్తా, దాని పచ్చిక మైదానాలనూ దిమ్నా, దాని పచ్చిక మైదానాలనూ నహలాలు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.

[36] రూబేను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే బేసెరు, దాని పచ్చిక మైదానాలనూ యాహసు, దాని పచ్చిక మైదానాలనూ

[37] కెదెమోతు, దాని పచ్చిక మైదానాలనూ మేఫాతు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.

[38] గాదు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గిలాదులోని రామోతు, దాని పచ్చిక మైదానాలనూ మహనయీము, దాని పచ్చిక మైదానాలనూ

[39] హెష్బోను, దాని పచ్చిక మైదానాలనూ యాజెరు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.

[40] వారి వారి వంశాల ప్రకారం, అంటే లేవీయుల మిగిలిన వంశాల ప్రకారం అవన్నీ మెరారీయులకు వచ్చిన పట్టణాలు. చీటి ద్వారా వారికి వచ్చిన పట్టణాలు పన్నెండు.

[41] ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంలో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణాలన్నీ నలభై ఎనిమిది.

[42] ఆ పట్టణాలన్నింటికీ పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ అలాగే ఉన్నాయి.

[43] యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించారు.

[44] యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు.

[45] యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి.

యెహోషువ — Chapters